News March 28, 2025
భద్రాద్రి: నిరుద్యోగులకు 2నెలల శిక్షణకు దరఖాస్తులు

గిరిజన నిరుద్యోగులకు రెండు నెలలపాటు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్స్ డైరెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు ITI, డిప్లొమా, పదో తరగతి ఆపైన చదివిన వారు ఏప్రిల్ 1 లోపు పాల్వంచ పట్టణంలోని టెక్ షోర్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్లో అప్లై చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ 94911 09068కు కాల్ చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 20, 2025
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్కు బయల్దేరి వెళ్లనున్నారు.
News November 20, 2025
TU: డిగ్రీ పరీక్షలు ప్రారంభం.. 10838 విద్యార్థుల హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఉమ్మడి నిజామాబాద్ పరిధిలో గురువారం తొలి రోజు డిగ్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు 30 పరీక్ష కేంద్రాలలో 11519 మంది విద్యార్థులకు గాను 10838 మంది విద్యార్థులు హాజరు కాగా 681 మంది గైర్హాజరయ్యారు. ఉదయం డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ పరీక్షలు జరుగగా మధ్యాహ్నం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయని వెల్లడించారు.
News November 20, 2025
‘జనజీవన స్రవంతి’ అంటే ఏంటంటే?

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు అనే వార్తలు వింటుంటాం. ‘జనజీవన స్రవంతి’ అంటే సమాజంలో శాంతియుతంగా, చట్టబద్ధంగా జీవించడం. మావోయిస్టులు హింస, ఆయుధాలు & రహస్య జీవితాన్ని విడిచిపెట్టి, సాధారణ పౌరులుగా మారారని అర్థం. వారు ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విద్య, ఉద్యోగం వంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఇది సూచిస్తుంది.


