News July 7, 2025
భద్రాద్రి: పంట పొలాలకు వెళ్లాలంటే సాహసమే.!

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు అధ్వానంగా తయారవుతున్నాయి. ప్రధాన రహదారుల పరిస్థితే ఇలా ఉంటే పంట పొలాలకు వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో ఊహకే అందనట్లు కనిపిస్తున్నాయి. దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు, వ్యవసాయ కూలీలు గుంతల దారిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ దారుల్లో ఎరువుల బస్తాలు ఎలా తీసుకెళ్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొరం అయినా పోయాలని కోరుతున్నారు.
Similar News
News August 11, 2025
జిల్లాగా ఏర్పడనున్న ఆదోని

ఆదోని ప్రజల చిరకాల కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా నుంచి పశ్చిమ ప్రాంతాన్ని విడదీసి ఆదోని కేంద్రంగా జిల్లా చేయాలంటూ ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆందోళనలు చేసినా ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం ఆదోని ప్రజల కల నెరవేర్చే దిశగా అడుగులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
News August 11, 2025
హుస్సేన్‌సాగర్‌కు ఓ వైపు వరద.. మరోవైపు విడుదల

హుస్సేన్‌సాగర్‌కు వరద కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. నగరంలో కురిసిన వర్షాలతో సాగర్‌కి వచ్చే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సాగర్‌కి ఇన్ ఫ్లో 1027 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1130 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
News August 11, 2025
9th క్లాస్ విద్యార్థులకు ‘ఓపెన్ బుక్’ పరీక్షలు

9వ తరగతి విద్యార్థులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. ఇందులో భాగంగా లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ పరీక్షలను స్టూడెంట్స్ బుక్స్ చూస్తూ రాయొచ్చు. అయితే స్కూళ్లు దీన్ని అమలుచేయడం తప్పనిసరి కాదని బోర్డు తెలిపింది. మరోవైపు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది.