News January 23, 2025
భద్రాద్రి: పేరెంట్స్ మందలించారని కుమారుడి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన వసంత రెడ్డి(22) ఇంటి వద్ద ఉంటున్నాడు. ఏదైనా పని చేయమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలిపారు. గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News November 21, 2025
సమర్థవంతంగా చేరేలా సమన్వయంతో పని చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే

వరంగల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. వరంగల్ దిశా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రహదారి నిర్మాణాలు, కల్వర్టులు, గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో పారదర్శకత పాటించాలన్నారు.
News November 21, 2025
మంచిర్యాల: ఆసుపత్రిలో ఆరేళ్ల చిన్నారి మృతి

మంచిర్యాలలోని ఓ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాహితి (6) అనే చిన్నారి మృతి చెందింది. వైద్యం సరిగా అందించకపోవడంతోనే చిన్నారి మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్య అధికారులు విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి న్యాయం చేయాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాగా గురువారం సైతం ఓ ఆసుపత్రిలో 4నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే.
News November 21, 2025
హనుమకొండ: ముగిసిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పది రోజులపాటు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది. డీడీజీ( స్టేట్స్), జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్ ఏఆర్ఓ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో పది రోజులపాటు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఆర్మీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులు కాగా జేఎన్ఎస్లో ఫిజికల్ ఫిట్ నెస్ నిర్వహించారు. ఆర్మీ అధికారులు కలెక్టర్ను కలిశారు.


