News March 19, 2025

భద్రాద్రి: పోడు రైతులకు కలెక్టర్ శుభవార్త

image

జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పోడు వ్యవసాయానికి విద్యుదీకరణ, ఉపాధి హామీ పనుల పురోగతి, త్రాగునీటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతల తవ్వకాలు, మీసేవ దరఖాస్తులు, ధరణి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.

Similar News

News November 14, 2025

HYD: ఇక సిటీలోనూ కాంగ్రెస్ హవా..!

image

గతంలో అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పల్లె ప్రజలే కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అయితే హస్తం పార్టీకి సిటీలో బలం లేదనే చర్చ ఏళ్లుగా కొనసాగింది. ఇటీవల కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో సిటీలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం వచ్చిందని, GHMC ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

News November 14, 2025

అసమ్మతి నేతలను సైలెంట్ మోడ్‌లోకి నెట్టిన రేవంత్

image

TG: కాంగ్రెస్‌లో గ్రూపు వివాదాలు సాధారణం. ప్రాధాన్యం లేక నిరాశతో ఉన్న సీనియర్లు CM రేవంత్‌పై పలుమార్లు అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినా వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే జూబ్లీ ఉపఎన్నికలో ఓటమి పాలైతే రేవంతే దీనికి కారణమని బలంగా ఫిర్యాదు చేయొచ్చని వారు భావించారు. కానీ పార్టీ గెలుపుతో నిరాశే ఎదురైంది. పక్కా ప్రణాళికతో సీనియర్లను CM సైలెంట్ మోడ్‌లోకి నెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

News November 14, 2025

కృష్ణా: 30 మంది జెడ్పీ ఉద్యోగులకు పోస్టింగ్

image

గత 6 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జెడ్పీ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు వారికి పోస్టింగ్‌లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్‌లో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. కౌన్సిలింగ్ ద్వారా 30 మంది ఉద్యోగులు జెడ్పీకి వచ్చారు. అయితే వీరికి సీట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వీరందరికీ ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.