News March 1, 2025
భద్రాద్రి: పోలీస్ స్టేషన్ నుంచి ప్రేమజంట పరార్

ఓ ప్రేమ జంట పోలీసుల కళ్లు గప్పి పోలీస్ స్టేషన్ నుంచి పరారైన ఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన బాలిక(17) ఫిబ్రవరి 23న అదృశ్యమవడంతో పేరెంట్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారిస్తుండగా బాలిక ప్రియుడితో కలిసి స్టేషన్‌కు వచ్చింది. పెళ్లి చేసుకుంటామని చెప్పగా మైనర్ అని చెప్పి ప్రియుడిపై కేసు నమోదుకు సిద్ధమయ్యారు. దీంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
Similar News
News February 27, 2026
బాలిక హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.
News February 27, 2026
నష్టాల్లో మొదలైన మార్కెట్లు

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 270 పాయింట్లు కోల్పోయి 81,974 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పతనమై 25,392 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ మినహా మిగతా రంగాల షేర్లన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News February 27, 2026
కొండగట్టు ఆలయ ఖజానాకు భారీ ఆదాయం

కొండగట్టు అంజన్న క్షేత్రంలో తలనీలాల వేలం ద్వారా దేవస్థానానికి భారీ ఆదాయం సమకూరింది. గురువారం నిర్వహించిన ఈ వేలంపాట మధ్యాహ్నం నుంచి రాత్రి 10 వరకు కొనసాగింది. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగిన ఉత్కంఠభరిత వేలంలో తొలుత హైదరాబాద్‌కు చెందిన రాజా ఎంటర్ప్రైజెస్ రూ.2.70 కోట్లు పాడగా.. అంతిమంగా తణుకుకు చెందిన ఇండియన్ హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.4.44 కోట్లకు టెండర్‌ను దక్కించుకుంది.


