News March 1, 2025

భద్రాద్రి: పోలీస్ స్టేషన్‌ నుంచి ప్రేమజంట పరార్

image

ఓ ప్రేమ జంట పోలీసుల కళ్లు గప్పి పోలీస్ స్టేషన్ నుంచి పరారైన ఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన బాలిక(17) ఫిబ్రవరి 23న అదృశ్యమవడంతో పేరెంట్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారిస్తుండగా బాలిక ప్రియుడితో కలిసి స్టేషన్‌కు వచ్చింది. పెళ్లి చేసుకుంటామని చెప్పగా మైనర్ అని చెప్పి ప్రియుడిపై కేసు నమోదుకు సిద్ధమయ్యారు. దీంతో వారు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

Similar News

News March 14, 2026

రఘు భాయ్.. ది రియల్ హీరో

image

టీమ్ఇండియా టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత నెట్టింట ఒకరి పేరు మారుమోగుతోంది. ఆయనే రాఘవేంద్ర (రఘు భాయ్). ఒకప్పుడు కేవలం ₹21తో ఇంటి నుంచి బయటకొచ్చి క్రికెట్ కోసం పోరాడిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. నెట్స్‌లో గంటకు 150 కి.మీ వేగంతో బంతులు విసిరి, మన బ్యాటర్లను ప్రపంచ విజేతలుగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర కీలకం. అందుకే విరాట్ కోహ్లీ వంటి స్టార్లే ఆయనను టీమ్‌ఇండియాకు నిజమైన హీరోగా అభివర్ణిస్తున్నారు.

News March 14, 2026

నల్గొండలో 40 డిగ్రీలు దాటిన ఎండలు

image

నల్గొండ జిల్లాలో వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి. మార్చి రెండో వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.4 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఎండ తీవ్రత గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఎండల నుంచి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

News March 14, 2026

దారుణం.. యువతికి HIV రక్తం ఎక్కించాడు!

image

TG: HIV సోకిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ (D) అన్నోజిగూడలో ఇటీవల మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. అతడికి HIV పాజిటివ్ అని తెలియడంతో అమ్మాయి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. కక్ష పెంచుకున్న మనోహర్ ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి సిరంజితో ఆమెకు HIV ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇటీవల యువతికి జ్వరం రావడంతో విషయం బయటపడింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.