News March 30, 2025
భద్రాద్రి ప్రజలకు ఎస్పీ ఉగాది శుభాకాంక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజల జీవితాలు ఉగాది పచ్చడిలా షడ్రుచులతో నిండాలని, ప్రతి ఒక్కరూ ఈ తెలుగు నూతన సంవత్సర ఆరంభాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
Similar News
News April 23, 2025
NGKL: ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి: సీపీఎం

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడికి వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.
News April 23, 2025
PHOTO: పహల్‌గామ్‌లో దాడి చేసింది వీరే

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.
News April 23, 2025
కనగానపల్లి వద్ద ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

కనగానపల్లి మండలంలోని మామిళ్ళపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పుట్టపర్తి అగ్నిమాపక శాఖలో పని చేస్తున్న ఫైర్ కానిస్టేబుల్ సుధాకర్(32) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.