News January 26, 2025

భద్రాద్రి ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు: ఎస్పీ రోహిత్

image

76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వెనక ఎంతో మంది పోరాటయోధుల త్యాగం దాగి ఉందని గుర్తు చేశారు.

Similar News

News February 15, 2025

కరీంనగర్: ఎక్కడ చూసినా అదే చర్చ

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

News February 15, 2025

జెర్రిపోతులగూడెంలో రికార్డింగ్ డ్యాన్సులు 

image

చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో కనకదుర్గమ్మ జాతర అంగరంగవైభవంగా జరుగుతోంది. జాతర వేడుకల్లో భాగంగా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. వాటిని చూడటానికి జెర్రిపోతులగూడెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రశాంత వాతవరణంలో వేడుకలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. 

News February 15, 2025

‘బార్బోన్ విస్కీ’పై టారిఫ్ తగ్గించిన భారత్

image

అమెరికాకు చెందిన మోస్ట్ పాపులర్ ‘బార్బోన్ విస్కీ’పై భారత ప్రభుత్వం టారిఫ్ రేటును తగ్గించింది. ఇదివరకు ఈ విస్కీ దిగుమతులపై 150% టారిఫ్ ఉండగా, దాన్ని 100%కి తగ్గించింది. మిగిలిన ఆల్కహాల్ ఉత్పత్తులపై 150% టారిఫ్ కొనసాగనుంది. 2023-24లో భారత్ 2.5 మి. డాలర్ల విలువైన బార్బోన్ విస్కీని దిగుమతి చేసుకుంది. భారత్ దిగుమతులపై అధిక టారిఫ్స్ వేస్తోందని ట్రంప్ విమర్శించిన తర్వాతి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

error: Content is protected !!