News December 31, 2024

భద్రాద్రి: ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి: ఎస్పీ

image

సంతోషాల నడుమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ప్రజలకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండ పోలీస్ శాఖ తరుపున భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్‌ 31న జిల్లా వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ తనిఖీ చేపడతామని చెప్పారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో రేపు విద్యాసంస్థలు బంద్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రేపు విద్యాసంస్థల బంద్ ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మస్తాన్, సుధాకర్, సురేష్ తెలిపారు. బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ రేపటి బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను కాల రాస్తుందని వారు పేర్కొన్నారు.

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్‌కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.

News October 17, 2025

ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

image

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.