News February 1, 2025
భద్రాద్రి: బాధితురాలి కోసం జడ్జి వచ్చారు..!

సాధారణంగా కోర్టులో జడ్జి ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. కానీ భద్రాచలం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జడ్జే బాధితురాలి వద్దకు వచ్చి మానవత్వం చాటుకున్నారు. ఒక చెక్ బౌన్స్ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిన ఉరిమెళ్ల పద్మావతి అనే మహిళ అనారోగ్యంతో మెట్లెక్కే స్థితిలో లేదు. విషయం తెలుసుకున్న జడ్జి వి.శివ నాయక్ మొదటి అంతస్తులో ఉన్న కోర్టు నుంచి దిగి ఆమె వద్దకు స్వయంగా వెళ్లి వాంగ్మూలం తీసుకున్నారు.
Similar News
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.
News November 26, 2025
రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.
News November 26, 2025
KMR: మద్యం మత్తులో వేధిస్తున్నాడని భర్తను చంపిన భార్య

ఎల్లారెడ్డి మండలం బాలాజీ నగర్ తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరచూ మద్యం సేవించి వేధిస్తున్నాడనే కోపంతో నిద్రిస్తున్న భర్త రత్నావత్ తుకారం (40)ను భార్య మీన హతమార్చింది. ఈ విషయాన్ని సీఐ రాజారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


