News April 4, 2025

భద్రాద్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ పట ఆవిష్కరణ

image

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గరుడ పట ఆవిష్కరణ జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ రాజ వీధిలోని చిన్న జీయర్ మఠానికి చేరుకున్న ఆలయ వైదిక బృందం అక్కడ గరుడ పటలేఖనం, గరుడపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గరుడ పట ఆవిష్కరణ ఉత్సవంలో రామానుజ దేవనాథ జీయర్ స్వామి పాల్గొన్నారు.

Similar News

News July 11, 2025

అల్లూరి: ‘రూ.1,000 కోట్లతో అభివృద్ధి’

image

పాడేరు కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన సమీక్షలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మండలానికి 100 గోకులాల ఏర్పాటు, ROFR పట్టాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా పది కుటుంబాలకు స్వయంగా మార్గదర్శిగా నిలిచారు. ఆర్గానిక్ వ్యవసాయం, పర్యాటక అభివృద్ధి, రూ.1000 కోట్లతో రహదారి, ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.

News July 11, 2025

ఎచ్చెర్ల: దారుణంగా హత్య చేశారు

image

ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 11, 2025

తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

image

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.