News November 9, 2024

‘భద్రాద్రి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు’

image

భద్రాద్రి ఆలయంలో బ్రహ్మోత్సవాల తేదీలను శుక్రవారం ఆలయ వైదిక పెద్దలు ఖరారు చేశారు. డిసెంబర్ 31 నుంచి అధ్యయన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జనవరి 9న తెప్పోత్సవం, 10న వైకుంఠ ద్వార దర్శనం, 12న విశ్వరూప సేవ ఉంటుందన్నారు. అధ్యయన ఉత్సవాల్లో భాగంగా దశావతారాలలో రామయ్య దర్శమిస్తారని తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 11, 2024

ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా..!

image

ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఎడాదిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కలెక్టరేట్‌లో ఓ అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఖమ్మం రేంజ్‌ కార్యాలయం నెంబర్లు-9154388981, 08742-228663, ఈ-మెయిల్‌ dsp_acb_kmm@telangana. gov.inను సంప్రదించాలన్నారు.

News December 11, 2024

ప్రజావాణిలో 27వేలకు పైగా సమస్యలకు పరిష్కారం:భట్టి

image

ప్రజావాణిలో 27వేలకుపైగా సమస్యలకు పరిష్కారించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ నెల 8వ తేదీకి సరిగ్గా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా వార్షిక రిపోర్ట్​ను ప్రభుత్వం రిలీజ్​ చేసింది. ప్రజావాణికి ఇప్పటివరకూ మొత్తం 82,955 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గ్రీవెన్స్​కు సంబంధించినవి 43, 272 ఉండగా.. 62 శాతం పరిష్కారమయ్యాయన్నారు. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నట్టు వెల్లడించారు.

News December 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> కల్లూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> కొనిజర్ల మండలం సింగరాయపాలెంలో సిపిఎం పార్టీ డివిజన్ సమావేశం
> మధిరలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
> బోనకల్ లో వ్యవసాయశాఖ అధికారుల పర్యటన
> కొనసాగుతున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడలు
> ముదిగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక సర్వే
> తల్లాడ మండలం నారాయణపురంలో చండీయాగం
> ఇల్లందులో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం