News February 23, 2025
భద్రాద్రి: మహాశివరాత్రి.. మరో మూడు రోజులే..!

మహాశివరాత్రి వేడుకలకు భద్రాద్రి జిల్లాలోని పలు దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. మణుగూరులోని నీలకంఠేశ్వరాలయం, అన్నపురెడ్డిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయం, కనకగిరిగుట్ట మీద వీరభద్ర ఆలయం, బూర్గంపాడులోని మోతెగడ్డ ఆలయం, దేవాలయాలు జాగారం ఉన్న భక్తులతో కిటకిటలాడుతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News November 28, 2025
NGKL: ఎన్నికల అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఖాతా తప్పనిసరి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవాలని అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత ఎన్నికలలో గడువు తక్కువగా ఉండటంతో పాత ఖాతాలను అనుమతించారు. అయితే, రెండో విడత ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
News November 28, 2025
21 మందిని అరెస్టు చేసిన సైబర్ పోలీసులు

వివిధ ప్రాంతాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. వీరిలో 13 ట్రేడింగ్ ఫ్రాడ్స్, మిగతా వారిని డిజిటల్ అరెస్ట్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు వీరిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా దాదాపు 49 కేసుల్లో బాధితులకు రూ.89.7 లక్షలను తిరిగి ఇప్పించారు.
News November 28, 2025
7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. BIG UPDATE

ఢిల్లీ పోలీస్ పరీక్షల(2025) తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 7,565 పోస్టులు ఉన్నాయి.
*కానిస్టేబుల్ (డ్రైవర్)- డిసెంబర్ 16, 17
*కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)- డిసెంబర్ 18 నుంచి జనవరి 6
*హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)- జనవరి 7 నుంచి 12
*హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్, TPO)- జనవరి 15 నుంచి 22.
> పూర్తి వివరాలకు ఇక్కడ <


