News February 23, 2025
భద్రాద్రి: మహాశివరాత్రి.. మరో మూడు రోజులే..!

మహాశివరాత్రి వేడుకలకు భద్రాద్రి జిల్లాలోని పలు దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. మణుగూరులోని నీలకంఠేశ్వరాలయం, అన్నపురెడ్డిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయం, కనకగిరిగుట్ట మీద వీరభద్ర ఆలయం, బూర్గంపాడులోని మోతెగడ్డ ఆలయం, దేవాలయాలు జాగారం ఉన్న భక్తులతో కిటకిటలాడుతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
Similar News
News March 15, 2025
జనగామ: రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ ఎడమ, కుడి కాలువల నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కుడి కాలువ ద్వారా జనగామ మరియు బచ్చన్నపేట మండలం పరిధిలోని పలు గ్రామాలలో 15000 ఎకరాలకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా నర్మెట మరియు రఘునాథపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాలలో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు.
News March 15, 2025
సంగారెడ్డి: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇయితే ఈ బడుల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.
News March 15, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

* పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ చైర్పర్సన్ * కృష్ణా: ముగిసిన ఇంటర్ పరీక్షలు * నేను పిఠాపురం MLA గారి తాలూకా: ఎంపీ బాలశౌరి* బందరు బైపాస్‌లో ప్రమాదం.. ఒకరు మృతి * లింగవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ * నేటి నుంచి ఒంటి పూట బడులు * జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర