News March 26, 2025
భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.
Similar News
News October 16, 2025
కామారెడ్డి: రైల్వే ట్రాక్పై మహిళ మృతదేహం

కామారెడ్డి పట్టణ శివారులోని రైల్వే ట్రాక్పై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది, ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
News October 16, 2025
NLG: దీపావళి ఆఫర్.. రూపాయికే సిమ్ కార్డ్

దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్కు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి వర్తిస్తుందన్నారు.
News October 16, 2025
KMR: NMMS దరఖాస్తుల గడువు పొడగింపు

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS)-2025 దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగించినట్లు డీఈఓ రాజు తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ/స్థానిక సంస్థల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదన్నారు. 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు https://bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.