News March 26, 2025

భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

image

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్‌ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.

Similar News

News July 8, 2025

నేను బాగున్న.. దేశం కోసం పోరాడు: ఆకాశ్ సోదరి

image

తన సోదరి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని భారత ప్లేయర్ ఆకాశ్ దీప్ <<16971842>>ఎమోషనల్ <<>>అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన సోదరి మీడియాతో మాట్లాడారు. ‘నేను బాగున్నానని, దేశానికి మంచి చేయడంపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్‌కు వెళ్లేముందు ఆకాశ్‌తో చెప్పా. ఆకాశ్ నా గురించి బహిరంగంగా మాట్లాడతారని నాకు తెలియదు. మేము దీన్ని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అతను ఎమోషనలై ఈ విషయాన్ని చెప్పాడు’ అని తెలిపారు.

News July 8, 2025

MHBD: RMP వైద్యం వికటించి బాలుడు మృతి!

image

కేసముద్రం మండలం బావుజీ తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. RMP చేసిన వైద్యం వికటించి తమ కుమారుడు చరణ్ (15) మృతి చెందాడని ధరావత్ బాలోజీ, అనితా దంపతులు ఆరోపించారు. కడుపునొప్పితో RMP దగ్గరకు వెళ్తే రెండు ఇంజక్షన్లు, మూడు టాబ్లెట్స్ ఇచ్చారని తెలిపారు. కాసేపటికి బాలుడు మృతిచెందినట్లు చెప్పారు. తమకు న్యాయం చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు.

News July 8, 2025

మల్యాల: ‘భార్య విడిగా ఉంటుందనే బాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం’

image

కొండగట్టులో గుడిసెల గట్టయ్య సోమవారం పెట్రోల్ పోసుకొని <<16984509>>ఆత్మహత్యాయత్నానికి <<>>పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతడు ఈ ఘాతుకానికి పాల్పడటానికి ప్రధాన కారణం తన భార్య కాపురానికి రాకుండా విడిగా ఉండటమే అని SI నరేష్ తెలిపారు. ఈ బాధతో మద్యానికి బానిసయిన అతడు సోమవారం ఉదయం విషం తాగాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స తీసుకోకుండానే కొండగట్టుకు వచ్చి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. క్షతగాత్రుడిది మేడిపల్లి మం. కొండాపూర్.