News June 24, 2024
భద్రాద్రి: మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సారపాక గాంధీనగర్‌లో మూడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2025
ఖమ్మం నుంచి పెద్దగట్టు జాతరకు బస్సులు

సూర్యాపేట పెద్దగట్టు జాతర నిన్నటి నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ జాతర ఐదు రోజులపాటు కొనసాగునుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి పెద్దగట్టు జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. భక్తులు ప్రయాణం సౌకర్యార్థం ఈ జాతరకు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.
News February 17, 2025
ప్రేమతో ఏది పెట్టినా పరమాన్నమే: మంత్రి

KMM: ప్రేమతో ఏది పెట్టినా అది పరమాన్నమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రఘునాథపాలెం (M) పుటనితండాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జొన్న రొట్టె, కొరివి పచ్చడి అంటే నాకు ఎంతో ఇష్టమని మంత్రి చెప్పారు. కాగా మంత్రి జొన్నరొట్టెలు తింటూ కాసేపు అక్కడి కాంగ్రెస్ నాయకులతో సరదాగా ముచ్చటించారు.
News February 16, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.