News January 17, 2025

భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా చేశారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

Similar News

News February 16, 2025

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.

News February 16, 2025

బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

image

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్‌ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

News February 16, 2025

పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలి: భట్టి

image

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలని… వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. డిజిటల్ భూసర్వేకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని  అన్నారు.

error: Content is protected !!