News January 25, 2025
భద్రాద్రి రామయ్యకు స్వర్ణ తులసి పూజలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం అంతరాలయంలో మూలమూర్తులకు అర్చకులు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన, సేవాకాలం, ఆరగింపు, నిత్య బలిహారణం, నిత్య హోమం, నిత్య పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని వేంచేపు చేసి నిత్యకళ్యాణం కనులపండువగా నిర్వహించారు. కల్యాణ దాతలకు స్వామివారి శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.
Similar News
News November 3, 2025
బాత్రూమ్‌లోనే గుండెపోట్లు ఎక్కువ.. ఎందుకంటే?

బాత్రూమ్‌లో ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి స్నానం ప్రధాన కారణం కాదని, మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడమే అసలు సమస్యని స్పష్టం చేశారు. ఈ ఒత్తిడి వల్ల ‘వాల్సాల్వా మ్యాన్యువర్’ జరిగి రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులు సంభవిస్తాయని తెలిపారు. దీనివల్ల రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయిన వారికి ఆక్సిజన్ సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
News November 3, 2025
ఇవాళే సీఏ ఫైనల్ ఫలితాలు

ICAI సెప్టెంబర్ సెషన్ 2025 సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు విడుదల కానున్నాయి. ఫౌండేషన్ స్థాయి ఫలితాలు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్: https://icai.nic.in/
News November 3, 2025
వరల్డ్ కప్‌తో నిద్రలేచిన ప్లేయర్లు

అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా.. భారత మహిళా జట్టుకు కలగా ఉన్న వరల్డ్ కప్ నిన్నటి మ్యాచ్‌తో సాకారమైంది. రాత్రంతా సెలబ్రేషన్స్‌తో అలసిపోయి పొద్దున్నే నిద్ర లేచిన ప్లేయర్లు చేతిలో వరల్డ్ కప్‌లో బెడ్‌పై నుంచే ఫొటోకు పోజులిచ్చారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘ఇంకా మనం కలలు కంటున్నామా?’ అని క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఫొటోలో అరుంధతి, రాధా యాదవ్, స్మృతి మంధాన ఉన్నారు.


