News February 3, 2025

భద్రాద్రి రామయ్య ఆలయంలో ఆసక్తికర ఘటన 

image

 భద్రాద్రి రామాలయంలో వాగ్గేయకార ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రెండో రోజు ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ముస్లిం తండ్రి కోడుకులు కచేరి నిర్వహించారు. వరంగల్‌కి చెందిన మహ్మద్ లాయక్ ఆహ్మద్, కోడుకు మహ్మద్  షహబాజ్ తమ సంగీత కచేరితో భక్తులను ఆకట్టుకున్నారు. మతసామరస్యం చాటిన వారిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Similar News

News April 16, 2026

100 రోజుల జలధార’తో భూగర్భ జలాల పెంపు: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘100 రోజుల జలధార’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి, జిల్లాలో భూగర్భ జలాల మట్టాన్ని 3 నుంచి 6 మీటర్ల వరకు పెంచాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో ‘100 రోజుల జలధార’ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News April 16, 2026

IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.