News November 13, 2024
భద్రాద్రి రామయ్య దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బుధవారం కుటుంబ సమేతంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు వేదపండితుల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Similar News
News December 8, 2024
నార్వారిగూడెం వద్ద రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన అశ్వారావుపేట మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్వారిగూడెం సమీపంలోని కోళ్ల ఫారం వద్ద లారీ-బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని అశ్వారావుపేట అస్పత్రికి తరలించారు.
News December 8, 2024
అశ్వారావుపేటలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్
తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దండాబత్తుల బజార్‌కు చెందిన సామినేని వెంకన్న, వరలక్ష్మీ దంపతుల కుమార్తె జశ్విత సాయి(17) ఇంటర్ చదువుతోంది. ఉదయం లంచ్ బాక్స్ సర్దుకునే విషయంలో తల్లీ, కూతురికి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
News December 8, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు
> ఖమ్మంలో CPM పార్టీ డివిజన్ మహాసభ > కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన > మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన > ఢిల్లీలో రైతులపై దాడిని నిరసిస్తూ కొత్తగూడెంలో రైతు సంఘం నిరసన >చింతూరులో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన