News March 20, 2025
భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం రూ. 1.14కోట్లు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.1,14,60,041 ఆదాయం వచ్చింది. 293 యూఎస్ డాలర్లు, 50 కెనడా డాలర్లు, వెండి 1262 కిలోలు, 133 గ్రాముల బంగారం వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు.
Similar News
News March 31, 2025
రాజమండ్రి: విషమంగా అంజలి ఆరోగ్య పరిస్థితి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కిమ్స్‌లో వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్న అంజలి (23) తాజా ఆరోగ్య బులిటెన్ విడుదలైంది. 7మంది వైద్యుల కమిటీ వైద్య పరీక్షలు చేసి ఈ ఆరోగ్య నివేదికను ఆదివారం రాత్రి విడుదల చేసింది. ఆమె ఎవరినీ గుర్తించలేని, స్పందించని స్థితిలో ఉందని వారు తెలిపారు. కళ్లకి వెలుతురు చూపినా రెస్పాన్స్ రావటం లేదన్నారు. మొత్తంగా ఆమె పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని వైద్యులు చెప్పారు.
News March 31, 2025
తుని: పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్

తుని పట్టణంలోని కొండవారిపేటలో గుట్టుచప్పుడు లేకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పట్టణ సీఐ గీతా రామకృష్ణ తన సిబ్బందితో కలిసి ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో పదిమంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2,100 నగదు సీజ్ చేశారు. పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
News March 31, 2025
నేటితో ముగియనున్న గడువు

AP: ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.