News January 11, 2026
భద్రాద్రి రామాలయంలో విలాస ఉత్సవాలు

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మూడు రోజుల ‘విలాస ఉత్సవాలు’ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు శనివారం స్వామివారు గోకులరామం వనవిహార మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేలాదిమంది భక్తులు పాల్గొని తరించారు. శ్రీరామ నృత్యాలయం కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
Similar News
News January 13, 2026
కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యం: కలెక్టర్ తేజస్

జిల్లాలో మంజూరైన ‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చిలుకూరు, గడ్డిపల్లి, తొండలలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 13, 2026
‘భోగి’ ఎంత శుభ దినమో తెలుసా?

భోగి నాడు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. గోదాదేవి శ్రీరంగనాథుడిలో లీనమై పరమ ‘భోగాన్ని’ పొందిన రోజు ఇదే. వామనుడి వరంతో బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే సమయమిది. ఆయనకు స్వాగతం పలికేందుకే భోగి మంటలు వేస్తారు. అలాగే ఇంద్రుడి గర్వం అణిచి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన పవిత్ర దినమిది. పరమశివుని వాహనమైన బసవన్న శాపవశాన రైతుల కోసం భూమికి దిగి వచ్చిన రోజూ ఇదే. ఇలా భక్తి, ప్రకృతి, పురాణాల కలయికే ఈ భోగి పండుగ.
News January 13, 2026
కర్నూలు: ‘రూ.8 వేలతో కొంటాం’

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి ద్వారా క్వింటాకు రూ.8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. కంది పంట నమోదు చేసిన ఈ-క్రాప్ సర్టిఫికెట్‌తో పాటు తేమ శాతం పరీక్షకు కందుల శాంపిల్ తీసుకొని రావాలని రైతులను సూచించారు.


