News March 28, 2025

భద్రాద్రి రాముడికి పోచంపల్లి పట్టు వస్త్రాలు

image

భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి. ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు దోర్నాల శ్రీనాథ్, ఇంజమూరి యాదగిరి, ఆడేపు ఆంజనేయులు, కడవేరు చంద్రశేఖర్‌ భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన నిలయంలో ఏర్పాటు చేసిన మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, పట్టు పంచలనేస్తున్నారు.

Similar News

News April 3, 2025

MDK: శిలాఫలకంపై పదవీకాలం ముగిసిన MLCల పేర్లు.. తీవ్ర విమర్శలు

image

పదవీకాలం ముగిసినా ఎమ్మెల్సీల పేరుతో అభివృద్ధి శిలాఫలకాలు ప్రారంభించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రావు రూ.14 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి శిలాఫలకంపై అధికారులు నిర్లక్ష్యంగా పదవీకాలం ముగిసిన ఎమ్మెల్సీ రగోతం రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పెట్టడంపై స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2025

వనపర్తి బిడ్డ అనూష తగ్గేదేలే..!

image

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అనకాయపల్లి పంచాయతీ పరిధి పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ అనూష వికారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ విభాగంలో ఎంపికై, బిహార్లో జరిగిన జాతీయ కబడ్డీ పోటీల్లో ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తిలో అనూషను శాలువాతో సత్కరించి అభినందించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థులకు అనూష స్ఫూర్తి కావాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

News April 3, 2025

ADB: బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్.. నలుగురిపై కేసు

image

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు  చేసినట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.

error: Content is protected !!