News June 22, 2024
భద్రాద్రి రాములోరి భూములకు రక్షణ కవచం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భూముల రక్షణకు ఆ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి అంగుళం భూమికి పక్కా దస్త్రాలను ఆన్లైన్లో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మాన్యం ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు వ్యూహరచన చేస్తున్నారు. దేవుని ఆస్తి ఎక్కడున్నా అది దేవునికే చెందుతుందని ఇప్పటికే ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. రాములవారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి.
Similar News
News January 11, 2026
వణుకుతున్న ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లాను చలి వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. శనివారం మధ్యాహ్నం సైతం ఉష్ణోగ్రత 18 డిగ్రీల కంటే తక్కువగా నమోదు కావడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రమైన చలిగాలుల ధాటికి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు చలికోట్లు, మంకీ క్యాపులు, మఫ్లర్లు ధరిస్తూ రక్షణ పొందుతున్నారు.
News January 11, 2026
ఖమ్మం: మ్యూజియం ముచ్చట తీరేదెన్నడు?

ఖమ్మం జిల్లా సైన్స్ మ్యూజియం ఏర్పాటుపై విద్యాశాఖ తీరు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. మ్యూజియం కోసం రూ.50 లక్షల నిధులు కేటాయించినా, పనులు అడుగు ముందుకు పడటం లేదు. మ్యూజియం వివరాలు అందజేయాలని డీఈవో ఆదేశించి 15 రోజులు గడుస్తున్నా కిందిస్థాయి సిబ్బందిలో నిర్లక్ష్యం వీడలేదు. ప్రయోగాత్మక విద్యకు ఈ జాప్యం పెద్ద అడ్డంకిగా మారింది.
News January 10, 2026
ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందించాలి: Dy.CM భట్టి

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన భేటీలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే కేంద్ర లక్ష్యాన్ని అభినందిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. విభజన హామీలు,పెండింగ్ నిధులపై కూడా చర్చించారు.


