News September 25, 2024

భద్రాద్రి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News October 13, 2024

ఎర్రుపాలెం: వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

ఎర్రుపాలెం మండల కేంద్రంలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News October 13, 2024

భద్రాచలంలో పేలిన గ్యాస్ సిలిండర్

image

భద్రాచలం పట్టణంలోని హోటల్ గీతాంజలి వీధిలో ఉన్న ఓ ఇంట్లో మహిళ దీపారాధన చేసింది. అనంతరం ఆరుబయట పనిచేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.

News October 13, 2024

కల్లోజి జయమ్మ మృతి పట్ల ఎంపీ సంతాపం

image

సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాతృమూర్తి కల్లోజి జయమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న శ్రీనివాస్ కు ఎంపీ రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.