News March 29, 2025

భద్రాద్రి: వడదెబ్బ సోకి వ్యక్తి మృతి

image

భద్రాద్రి జిల్లాలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. టేకులపల్లి మండలంలోని కొప్పు రాయి గ్రామంలో శుక్రవారం వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందారు. గ్రామానికి చెందిన వేప బక్కయ్య(55) మిర్చి ఏరడానికి కూలీ పనులకు వెళ్లడంతో వడదెబ్బ తగిలిందని, దీంతో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతనికి భార్య సాయమ్మతో పాటు ముగ్గురు పిల్లలు కలరు.

Similar News

News April 18, 2025

ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

image

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.

News April 18, 2025

గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.

News April 18, 2025

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నిన్న ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసి, మళ్లీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!