News January 10, 2025
భద్రాద్రి: వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు విజయవంతం: కలెక్టర్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విజయవంతమైందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వహించారని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.
News December 5, 2025
ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.
News December 5, 2025
కోతుల సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్

కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోడు భూముల పట్టా ఉన్నవారు ఎవరైనా అడవి జంతువుల వేటకు పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నించిన గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని చెప్పారు. యువత, పిల్లలను ఆకర్షించేలా అర్బన్ పార్క్లో జంతువులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై ఎక్కడ కూడా కోతులకు ఆహార పదార్థాలు ఇవ్వవద్దని పేర్కొన్నారు.


