News April 16, 2025
భద్రాద్రి: ‘సన్నబియ్యం పంపిణీపై ఫేక్ న్యూస్ నమ్మొద్దు’

తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. చౌక దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం బాగున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 31, 2025
కోడలి జీతంలో మామకు రూ.20వేలు: రాజస్థాన్ హైకోర్టు

కుటుంబ పోషణ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న కోడలికి రాజస్థాన్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భర్త చనిపోవడంతో అతడి ఉద్యోగం భార్యకు లభించింది. అయితే ఆమె తమ బాగోగులు చూసుకోవట్లేదని మామ భగవాన్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కారుణ్య నియామకం మొత్తం కుటుంబానికి చెందుతుందని కోడలు శశి కుమారి జీతం నుంచి ప్రతినెలా రూ.20వేలు తీసి సింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి.
News October 31, 2025
విశాఖ: లెక్చరర్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య.!

ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తేజను కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులకు గురిచేశారని మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొన్నిరోజులుగా వేధింపులు ఎక్కువవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.
News October 31, 2025
రక్తదాన శిబిరానికి భారీ స్పందన: సీపీ సునీల్ దత్

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేలకొండపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని సీపీ సునీల్ దత్ అన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని కొనియాడారు. ఈ శిబిరంలో సుమారు 1500 మంది దాతల నుంచి రక్తం సేకరించినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.


