News February 10, 2025
భద్రాద్రి: సర్పంచ్ ఎన్నికలు.. అదనపు కలెక్టర్ సూచన

గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం, అభ్యంతరాల స్వీకరణపై భద్రాద్రి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధ్యక్షతన ఐడీఓసీ కార్యాలయ సమావేశం మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా చందన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.
Similar News
News February 14, 2026
విశాఖ: బిల్డింగ్ పైనుంచి పడి యువకుడి మృతి

విశాఖలోని సాగర్ నగర్‌లో బిల్డింగ్ పరంజి విరిగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వాంబేకాలనీకి చెందిన కోలా రాజు(30) డ్రైవింగ్, విద్యుత్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఓ బిల్డింగ్‌లో విద్యుత్ పని చేస్తుండగా పరంజి విరిగిపోవటంతో 4 అంతస్థుల పైనుంచి పడి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.
News February 14, 2026
ఏలేశ్వరం కొండను చూసేద్దాం ఛలో ఛలో!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జలాశయం మధ్యలో ఉన్న ఏలేశ్వరం కొండకు తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీలు నడపనున్నట్లు పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. పెద్దలకు రూ.250, పిల్లలకు (4 నుంచి 12 సంవత్సరాల వరకు) రూ.200లుగా టికెట్ ధరలు నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఏలేశ్వరం కొండకు లాంచీలు నడపనున్నట్లు తెలిపారు.
News February 14, 2026
నిజాయతీకి నిలువుటద్దం!

నేడు దామోదరం సంజీవయ్య 105వ జయంతి. కర్నూలు జిల్లా పెద్దపాడులో జన్మించిన ఆయన అతి పిన్న వయసులో (38 ఏళ్లు) ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. తొలి దళిత సీఎంగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఏసీబీ వ్యవస్థ స్థాపన, భూ పంపిణీ వంటి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి అందరికీ అజాతశత్రువుగా పేరొందారు. పదవులు అనుభవించినా సొంత ఇల్లు కూడా లేని ఆయన నిరాడంబరత నేటి తరానికి స్ఫూర్తిదాయకం.


