News February 26, 2026

భద్రాద్రి: సాకారం కానున్న ఏజెన్సీ క్రీడాకారుల కల

image

భద్రాచలం ఏజెన్సీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరనుంది. భద్రాచలంలో గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటు ఏర్పాటు చేస్తూ ఐదు ఎకరాల భూమిని సైతం కేటాయిస్తూ క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రమే మైదానం ఉండడంతో అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహిస్తుండగా గ్రీన్ ఫీల్డ్ హామీ కే పరిమితం కాకుండా భూసేకరణ, నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ 1st ఇయర్‌.. HYDలో ఇదీ పరిస్థితి..!

image

HYDలో జిల్లాను ఇంటర్‌లో 3భాగాలుగా విభజించారు. HYD-1లో రెగ్యులర్ 1st ఇయర్‌ విద్యార్థులు 29660 మందికి 19933 మంది పాసవ్వగా 67.20%తో 8వ ర్యాంక్ కొట్టింది. HYD-2లో 36997మందికి 23001 పాసవ్వగా 62.17%తో 17వ స్థానంలో, HYD-3లో 11773 మందికి 7698 మంది పాసవ్వడంతో 65.39%తో 10వ స్థానంలో నిలిచింది.
☛ VOCలో HYD-1: 1357మందిలో 899 మంది పాసై 66.25%
☛ HYD-2 2043కి 1279 మంది 62.60%
☛ HYD-3 677కి 436 మంది పాసై 64.40%

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. మహబూబాబాద్‌కు 30వ ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. MHBD(D)లో రెగ్యులర్ విద్యార్థులు 2882 మంది పరీక్షలు రాయగా 1855 మంది పాసై 64.37 శాతంతో స్టేట్‌లో 30వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 955 మందికి 621 మంది పాసై 65.03 శాతంతో 34వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 231 మందికి 74 మంది పాసై 32.03%తో 18వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 65 మందికి 23మంది పాసై 35.38%తో 33వ స్థానం వచ్చింది.

News April 12, 2026

తిరుమలలో ఇలా చేయకండి..!

image

తిరుమల మాడ వీధిలోని తాగునీటి కుళాయి వద్ద ఓ వ్యక్తి షేవింగ్ చేసుకున్నాడు. భక్తులకు అందుబాటులో ఉంచిన తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, స్థానికులు తిరిగే ప్రదేశాల్లో పరిశుభ్రత, నియమాలు పాటించాలని కోరుతున్నారు.