News January 25, 2025
భద్రాద్రి: స్మగ్లర్లు, వేటగాళ్లపై కఠిన చర్యలు: DFO కృష్ణగౌడ్

అడవుల్లో వన్యప్రాణులకు ఉచ్చులు ఏర్పాటు చేసి జంతువులను చంపుతున్న వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ సూచించారు. శుక్రవారం ఆయన రేగళ్ల, ఆళ్లపల్లి, చాతకొండ పలు రేంజిలను సందర్శించారు. అడవిని కొల్లగొడుతున్న స్మగ్లర్లు, వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రేంజర్లు జశ్వంత్, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
సీఎం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి

మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. గురువారం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి ఆళ్ల నానిని సీఎం చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు.
News February 14, 2025
రంజీ సెమీస్‌లో ఆడనున్న జైస్వాల్

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు కోల్పోయిన టీమ్‌ఇండియా ఓపెనర్ జైస్వాల్ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఆడనున్నారు. ఈనెల 17 నుంచి నాగ్‌పూర్‌లో విదర్భతో మ్యాచులో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. తొలుత ప్రకటించిన CT జట్టులో జైస్వాల్ పేరు ఉన్నప్పటికీ తర్వాత అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. జైస్వాల్‌ను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్స్ లిస్టులో చేర్చారు. అతడు జట్టుకు అవసరమైనప్పుడు దుబాయ్ వెళ్తారు.
News February 14, 2025
రేపు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’లో భాగంగా CM చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11.45కు ఆయన కందుకూరు TRR కాలేజీలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.