News April 10, 2025
భద్రాద్రి: 2నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం

భద్రాద్రి(D) అశ్వారావుపేట(M) కంట్లం ఎఫ్‌బీఓలు గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీప అటవీ ప్రాంతంలో 2 నాటు తుపాకులు, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్న ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ మురళి వివరాలు.. పోలీసులు గస్తీ నిర్వహించగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏపీ(S) ఏలూరు(D) బుట్టాయగూడెంకు చెందిన కారం రవి, కామ మంగబాబు, వంజం నవీన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వివరించారు.
Similar News
News October 28, 2025
మొంథా తుపాను.. అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం కలెక్టర్

మొంథా తుపాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. రానున్న 2, 3 రోజుల పాటు రైతులు పంట కోతలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగకుండా కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పంటలను రక్షించే చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తూ కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
ఫలించిన తుమ్మల కృషి.. ఖమ్మంకు రూ.200 కోట్లు

ఖమ్మం నగరానికి శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో రూపొందిన ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడవునా మున్నేరు, పాలేరుల నుంచి నీటి సరఫరా జరగనుంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు ఆధునిక పైపులైన్, ఫిల్టర్ బెడ్ వ్యవస్థలు ఏర్పాటవనున్నాయి. ఖమ్మం నగర అభివృద్ధికి ఇది మైలు రాయి అని నగర ప్రజలు మంత్రి తుమ్మల కృషిని ప్రశంసిస్తున్నారు.
News October 27, 2025
ఖమ్మం: పంట కోతలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

రాబోయే 2 రోజుల పాటు తుపాను ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు పంట కోతలు వాయిదా వేసుకోవాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 100% ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పంట నష్టం జరగకుండా టార్పాలిన్ కవర్లు సిద్ధం చేయాలని సూచించారు.


