News December 16, 2024

భయం గుప్పిట్లో తిరుపతి..!

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది. దీంతో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.

Similar News

News January 9, 2026

చిత్తూరులో గణతంత్ర వేడుకలపై సమీక్ష

image

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్ఓ కార్యాలయంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 7 గం.లకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇన్‌ఛార్జ్‌గా చిత్తూరు ఆర్డీవో ఉంటారన్నారు.

News January 9, 2026

చిత్తూరు : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.

News January 8, 2026

చిత్తూరు కోర్టులో పేలుడు పదార్థాలు లేవు: పోలీసులు

image

చిత్తూరు కోర్టులో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. జడ్జికి బాంబు బెదిరింపులపై మెయిల్ రావడంతో అడిషనల్ ఎస్పీ దేవదాస్ ఆధ్వర్యంలో సిబ్బంది నాలుగు బృందాలు కోర్టులో తనిఖీలు చేపట్టాయి. కోర్టులోని వారిని సురక్షితంగా బయటకు పంపి అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఐదు గంటలపాటు సాగిన తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తేల్చారు.