News December 16, 2024
భయం గుప్పిట్లో నెల్లూరు

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. బుధ, గురు వారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది. దీంతో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో నెల్లూరు ప్రజలు వణికిపోతున్నారు.
Similar News
News October 21, 2025
నెల్లూరులో అమరవీరులకు నివాళి

పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నెల్లూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల, పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. జోరు వానలోనూ కవాతు నిర్వహించారు. అంకితభావంతో పనిచేస్తూ అమరత్వం పొందిన పోలీసులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పలువురు పేర్కొన్నారు.
News October 21, 2025
నేడు నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

నెల్లూరు జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. దీపావళి రోజు వర్షం పడటంతో చాలామంది టపాసులు సరిగా పేలలేదు.
News October 20, 2025
కందుకూరు TDPలో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..

కందుకూరు నియోజకవర్గ టీడీపీలో ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు ..’ అన్న సామెత ఆదివారం నిజమైంది. రెండు దశాబ్దాల పాటు TDPలో తిరుగులేని నాయకుడిగా చక్రం తిప్పిన మాజీ MLA డా.దివి శివరాంకు ఆదివారం దారకానిపాడులో కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వలేదు. శివరాం అనుచరుడిగా, ఆయన పైరవీలతో పార్టీ ఇన్ఛార్జ్ అయి, ప్రస్తుతం MLAగా ఉన్న ఇంటూరి నాగేశ్వరావు కుర్చీలో కూర్చుంటే వెనుక వరుసలో శివరాం నిలబడాల్సి వచ్చింది.