News December 16, 2024

భయం గుప్పిట్లో నెల్లూరు

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. బుధ, గురు వారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది. దీంతో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో నెల్లూరు ప్రజలు వణికిపోతున్నారు.

Similar News

News July 8, 2025

నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

image

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?

News July 8, 2025

ఆ దాడికి మాకు సంబంధం లేదు: ప్రశాంతిరెడ్డి

image

మహిళ అని చూడకుండా నీచమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్నను ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు సమర్ధించడం సరికాదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ‘ప్రసన్నపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా. ఆయన నివాసంపై జరిగిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన నీచుడు ప్రసన్న’ అని ఆమె మండిపడ్డారు

News July 7, 2025

అనామకులతో అప్రమత్తంగా ఉండాలి: SP

image

మీ రక్షణే మా భద్రతగా నెల్లూరు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. నెల్లూరు బారాషహిద్ దర్గాలో రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగలో పోలీసు బందోబస్తు, గంధ మహోత్సవానికి చేసిన ఏర్పాట్లను ఆయన పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాత్రికి జరగనున్న ప్రధాన ఘట్టం అయిన గంధ మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనామకులతో అప్రమత్తంగా ఉండాలన్నారు.