News March 29, 2025
భరత్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మహిళ హత్య కేసును ఛేదించారు

ఈనెల 26న జరిగిన భరత్ నగర్ ఫ్లైఓవర్ కింద జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జనగామ చెందిన కనకరాజు అనే వ్యక్తి ఆ మహిళతో శారీరకంగా కలిసిన తర్వాత కొట్టి హత్య చేసినట్టు తెలిపారు. హత్య చేసిన వ్యక్తి పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.
Similar News
News April 3, 2025
చోడవరం: చెట్టు పైనుంచి జారిపడి మృతి

చోడవరం మండలం నరసయ్యపేట గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం కల్లు తీయటానికి తాటి చెట్టు ఎక్కిన కల్లుగీత కార్మికుడు మేడిశెట్టి నూకరాజు (30) ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళుతున్న రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 3, 2025
తిరుపతి మార్గంలో తప్పిన పెనుప్రమాదం

భాకరాపేట ఘాట్ రోడ్డులో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. కొంత మంది ప్రయాణికులతో మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సు తిరుపతికి బయల్దేరింది. ఘాట్ రోడ్డులోకి రాగానే బస్ బ్రేక్లు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత చాకచక్యంగా రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణనష్టం తప్పింది.
News April 3, 2025
‘అమరావతి’కి తొలి విడత రుణం.. ఖాతాలో రూ.3,535 కోట్లు జమ

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తొలి విడతలో రూ.3,535 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ నిధులు ఇవాళ ప్రభుత్వ ఖాతాలో జమయ్యాయి. త్వరలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ADB) నుంచీ తొలి విడత రుణం మంజూరవుతుందని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ADB రూ.6,700 కోట్లు చొప్పున రుణం ఇస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,400 కోట్లు ప్రత్యేక సాయంగా అందిస్తోంది.