News April 11, 2024
భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం

కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక 2నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Similar News
News March 18, 2025
కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

జడ్చర్ల మండలంలో <<15786400>>నవవధువు <<>>ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్తమామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
News March 18, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఏన్కూర్: శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో వేలం పాట ∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు∆} మధిరలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పర్యటన
News March 18, 2025
ఖమ్మంలో దూసుకెళ్తున్న LRS ఆదాయం

ఎల్ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో LRS ఆదాయం దూసుకెళ్తుంది. రోజుకు 70 నుంచి 80 దరఖాస్తులకు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 1,895 దరఖాస్తులకు చెల్లింపులు జరగగా.. రూ. 10.61 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది