News March 7, 2025

భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

image

ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.

Similar News

News December 11, 2025

కర్నూలు: ‘ఈనెల 21న జరిగే పల్స్ పోలియోను విజయవంతం చేయండి’

image

డిసెంబర్ 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు 3,52,164 మంది పిల్లలకు వందశాతం టీకా వేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన మెడికల్ ఆఫీసర్ల సెన్సిటైజేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పీహెచ్సీలు, యుపిహెచ్సీలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. బయటికి మందులు పంపకూడదు, డెలివరీ తర్వాత డబ్బులు వసూలు చేయకూడదు అని స్పష్టం చేశారు.

News December 11, 2025

కర్నూలు కలెక్టర్‌కు 9వ ర్యాంకు.. మంత్రి టీజీ భరత్‌ ర్యాంక్ ఇదే..!

image

కర్నూలు కలెక్టర్‌ డాక్టర్ ఏ.సిరికి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 9వ ర్యాంక్ ఇచ్చారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక మొత్తం 1,023 ఫైల్స్ స్వీకరించారు. వాటిలో 714 ఫైల్స్ క్లియర్ చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ 17వ స్థానంలో నిలిచారు. 548 ఫైళ్లను పరిష్కరించారు.

News December 10, 2025

100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

image

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.