News March 7, 2025

భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

image

ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.

Similar News

News January 22, 2026

క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ నుంచి అంగన్వాడీ కేంద్రాలు, ఇరిగేషన్ అంశాలకు సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై సంబంధిత శాఖల జిల్లా అధికారులలో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.

News January 22, 2026

నంద్యాల: Night view అదరహో!

image

శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం రాత్రి వేళ విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతోంది. బుధవారం రాత్రి చిత్రీకరించిన రమణీయ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఈ అద్భుతమైన రాత్రి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఓం నమఃశివాయ!

News January 22, 2026

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

image

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.