News March 29, 2025
భర్త చేతిలో భార్య దారుణ హత్య

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News December 7, 2025
సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.
News December 7, 2025
కొత్తగూడెం: మత్తులో ట్రాక్ దాటుతూ రైలు కిందపడి..

మద్యం మత్తులో రైల్వే ట్రాక్ దాటుతుండగా గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన కొత్తగూడెంలో జరిగింది. శనివారం రాత్రి రైటర్ బస్తీ గొల్లగూడెం పక్కన ఉన్న ట్రాక్ దాటుతున్న యూసఫ్ అనే యువకుడికి ప్రమాదంలో కుడి కాలు విరిగింది. రైల్వే పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 7, 2025
విజయవాడ: ‘నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ కీలకం’

నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా మాజీ మంత్రి జోగి రమేశ్‌ను గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుకు రూ. 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లే దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడినట్లు సిట్ తెలిపింది. జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లడానికి కూడా జోగి రమేశే కారణమని వెల్లడించింది.


