News March 29, 2025

భర్త చేతిలో భార్య దారుణ హత్య

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనిపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News April 3, 2025

సుంకేసుల డ్యామ్‌ ఘటన.. మృతులు వీరే!

image

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్‌ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్‌ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్‌ (13), ఫైజాన్‌ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 3, 2025

క‌ర్నూలు-విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులపై చ‌ర్చ

image

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి టీజీ భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి ఈ మేరకు చ‌ర్చించిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పార‌ని భరత్ తెలిపారు.

News April 3, 2025

క‌ర్నూలు- విజ‌య‌వాడ విమాన స‌ర్వీసులపై చ‌ర్చించిన మంత్రి టీజీ

image

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసులు ప్రారంభించాల‌ని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కోరిన‌ట్లు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి క‌ర్నూలు – విజ‌య‌వాడ విమాన సౌక‌ర్యంపై చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పార‌ని టి.జి భరత్ పేర్కొన్నారు.

error: Content is protected !!