News July 22, 2024
భర్త నుంచి కాపాడండి: బనగానపల్లె మహిళ

భర్త నుంచి తనను కాపాడాలంటూ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. బనగానపల్లెకు చెందిన ఉప్పరి అన్నపూర్ణ అనే మహిళ భర్త నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని తెలిపారు. అదనపు కట్నం కోసం తరచూ హింసిస్తుంటే రూ.లక్ష ఇచ్చామని అయినా మరికొంత డబ్బు కావాలని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల పత్రంపై సంతకం పెట్టాలంటూ తనపై దాడి కూడా చేశాడని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 15, 2025
సమాజ పరిశుభద్రత ఎంతో అవసరం: కలెక్టర్

ప్రస్తుత సమాజంలో పరిశుభ్రత పాటించే విధంగా ప్రతి ఒకరు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పిలుపునిచ్చారు. శనివారం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘వ్యక్తిగత, సమాజ పరిశుభద్రత”’ ర్యాలీని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
News November 15, 2025
పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండకూడదు: కలెక్టర్ సిరి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు డ్రాపౌట్లు కాకుండా చూడాలని, పిల్లలను వలసలకు తీసుకెళ్లే తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి విద్యా శాఖాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీఈఓ, ఎంఈఓలతో నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్యపై దృష్టి సారించాలని సూచించారు.
News November 14, 2025