News March 26, 2025
భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య: నర్సీపట్నం సీఐ

నాతవరం మండలం ఎంబీ పట్నంలో మంగళవారం భర్త మందలించడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు నర్సీపట్నం సీఐ రేవతమ్మ తెలిపారు. కుమార్తె అల్లరి చేయడంతో తల్లి వెంకటలక్ష్మి కొట్టినట్లు తెలిపారు. కుమార్తెను ఎందుకు కొట్టావని భర్త గోవింద్ భార్యను మందలించాడన్నారు. అనంతరం గోవింద్ జీడి తోటలోకి వెళ్ళిపోగా మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 22, 2025
HYD: ఐబొమ్మ రవి కేసులో సీఐడీ రంగ ప్రవేశం

ఐబొమ్మ రవి కేసులో తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదించాడు. నాలుగు బెట్టింగ్ యాప్‌లను రవి ప్రమోషన్ చేశాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర నుంచి సీఐడీ సేకరించింది. రవి ఆర్థిక లావాదేవీలపైనా వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
News November 22, 2025
MBNR: డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఉపకులపతి

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో శనివారం నుంచి నిర్వహించి డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కేంద్రాలకు వెళ్లే ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్స్ స్క్వాడ్లకు ఆర్డర్ కాపీలను అందజేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కంట్రోలర్ డా కె ప్రవీణ తెలిపారు.
News November 22, 2025
అక్రమ ఇసుక తవ్వకాల్లో హరీశ్‌రావు పాత్ర: మెదక్ ఎమ్మెల్యే

అక్రమ ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు.. ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ ప్రసన్న కుమార్‌తో పాటు రెవెన్యూ అధికారులకు సూచించారు. ఇకపై మెదక్‌లో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాలని ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నేతలు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారని, ఇందులో హరీశ్‌రావు పాత్ర సైతం ఉందని ఆయన ఆరోపించారు.


