News March 3, 2025

భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Similar News

News December 10, 2025

ఉప్పల్‌లో మెస్సీ పెనాల్టీ షూటౌట్

image

TG: లియోనెల్ మెస్సీ “GOAT టూర్ ఆఫ్ ఇండియా 2025″లో భాగంగా ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి RR, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా, చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

News December 10, 2025

సిరిసిల్ల జిల్లాలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 27 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 12 మండలాల్లోని 260 గ్రామపంచాయతీలకు గాను 27 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 233 సర్పంచ్ స్థానాల్లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. 860 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 3 మండలాలు, తుది విడతలో 4 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

News December 10, 2025

SRCL: ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ బందోబస్తు: SP

image

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మహేశ్ బి గితే తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. ఎక్కడైనా సమస్యలుంటే అధికారులు వెంటనే తెలియజేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో RDOలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, నోడల్ అధికారులు శేషాద్రి, లక్ష్మీరాజం పాల్గొన్నారు.