News March 3, 2025
భర్త మృతిని తట్టుకోలేక భార్య బలవన్మరణం

శ్రీ సత్యసాయి జిల్లాలో విషాద ఘటన జరిగింది. హిందూపురం మండలం కొడిపి గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే రైతు ఉదయం పొలం నుంచి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురై కుప్పకూలి మృతిచెందారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన భార్య భాగ్యమ్మ (60) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Similar News
News March 22, 2025
విశేష దర్శనంలో భద్రకాళీ అమ్మవారు

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శనివారం అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదములు అందచేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.
News March 22, 2025
నాగర్ కర్నూల్: నిరుద్యోగ యువతకు తప్పని సమస్య..!

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం కింద లబ్ధిపొందేందుకు రేషన్ కార్డు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని పలువురు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినప్పటికీ, పాత రేషన్ కార్డు తొలగించాల్సిన నిబంధనతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. పెళ్లయిన వారు తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లోనే కొనసాగుతుండడంతో కొత్త కార్డు పొందడానికి సమస్య ఎదురవుతోందని, దీంతో పథకానికి అప్లై చేయని పరిస్థితి నెలకొందన్నారు.
News March 22, 2025
అప్పుడు బావురుమని ఏడ్చినా ఫలితం ఉండదు: పిన్నెళ్లి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణ ట్వీట్ చేశారు. ‘ఓడిపోయినప్పుడు విలువలు మాట్లాడి.. గెలిచినప్పుడు గేలి చేస్తూ శునకానందం పొంది.. రేపు మీరు ఓడిపోయిన తర్వాత బావురుమని ఏడ్చినా ఉపయోగం ఉండదు’ అని అన్నారు. కూటమి నేతలను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ వదిలినట్లు పలువురు చెబుతున్నారు.