News July 29, 2024

భర్త మోసం చేశాడని అత్తింటి ముందు నిరసన

image

తనతో అప్పులు చేయించి భర్త మోసం చేశాడంటూ విశాఖపట్నంకు చెందిన అచ్యుతాంబ ఆదివారం ఆరోపించారు. కాకినాడ అర్బన్ జగన్నాథపురం ముత్తానగర్‌లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. ముత్తానగర్‌కు చెందిన జయరాజు 2019లో తనను వివాహం చేసుకున్నారన్నారు. వ్యాపారం కోసం విశాఖలో పలువురి నుంచి రూ.28 లక్షలు తన ద్వారా అప్పుగా తీసుకున్నారని, 20 కాసుల బంగారం తాకట్టుపెట్టి రూ.10 లక్షలు ఇవ్వగా, తనను మోసం చేశాడని వాపోయారు.

Similar News

News December 6, 2025

విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

image

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్‌లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.

News December 6, 2025

నిఘాలో తూర్పు గోదావరి

image

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.

News December 6, 2025

పోలీసులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ

image

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.