News February 14, 2025
భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.
Similar News
News November 8, 2025
వాట్సాప్లో క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

వాట్సాప్ క్రాస్ ప్లాట్ఫామ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.
News November 8, 2025
జగిత్యాల: మక్కలు క్వింటాల్ ధర రూ.2075

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2075, కనిష్ఠ ధర రూ.1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.1921, కనిష్ఠ ధర రూ.1815, వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2051, కనిష్ఠ ధర రూ.1900, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2550, కనిష్ఠ ధర రూ.1875గా పలికాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.
News November 8, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధికా జైస్వాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తిగా రాధిక జైస్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఒకటవ అదనపు సెషన్స్ జడ్జిగా పుష్పలతకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణా చారికి న్యాయసేవాధికార సంస్థ ఇంచార్జి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.


