News March 25, 2025
‘భర్త వేధింపులతోనే సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య’

భర్త వేధింపులే తమ కూతురి ఆత్మహత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాండ్లపెంట మండలంలోని వంకపల్లి గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ రాజేశ్వరి(29) అనే వివాహిత సోమవారం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి రామసుబ్బమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వాలిబాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 9, 2025
అల్లూరి జిల్లాలో రోడ్డెక్కనున్న నైట్ హల్ట్ బస్సులు

మావోయిస్టులు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు PLGA వారోత్సవాలు ప్రకటించడంతో గిరిజన ప్రాంతానికి వచ్చే నైట్ హల్ట్ బస్సులు సోమవారం వరకు పలు ప్రాంతాలకు నిలిపివేయడం, కొన్ని బస్సులు పోలీసు స్టేషన్ సమీపంలో ఉంచడం జరిగేది. నిన్నటితో వారోత్సవాలు ముగిసాయి. నేటి నుంచి నైట్ హల్ట్ బస్సు సర్వీసులు వై.రామవరం, రాజవొమ్మంగి, రెవళ్లు యధావిధిగా నడుస్తాయని ఏలేశ్వరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు.
News December 9, 2025
ఫ్రాడ్ కాల్స్ వేధిస్తున్నాయా?

ప్రస్తుతం చాలా మందిని ఫ్రాడ్ కాల్స్, మెసేజ్లు వేధిస్తున్నాయి. అయితే వాటిపై మనం ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. సంచార్ సాథీ (<
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.


