News March 13, 2025

భవన నిర్మాణానికి 24 గంటల్లో అనుమతులు

image

భవన నిర్మాణ అనుమతుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో అనుమతులు పొంది నిర్మాణాలు ప్రారంభించుకోవచ్చని పట్టణ ప్రణాళిక శాఖ అనంతపురం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్ తెలిపారు. బుధవారం కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తు పోర్టల్‌లో అప్లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు.

Similar News

News October 14, 2025

జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కర్నూలుకు బంగారు పతకాలు

image

ఈనెల 10 నుంచి 14 వరకు భువనేశ్వర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో అండర్-20 విభాగంలో కర్నూలుకు చెందిన అథ్లెట్ మొగిలి వెంకట్రామిరెడ్డి ఏపీ తరఫున పాల్గొని బంగారు పతకాలు సాధించాడు. 800, 1500 మీటర్ల పరుగు పోటీల్లో ఈ ఘనత సాధించిన వెంకట్రామిరెడ్డిని అథ్లెటిక్స్ అసోసియేషన్ క్రీడా ప్రతినిధులు హర్షవర్ధన్ మంగళవారం ఓ ప్రకటనలో అభినందించారు.

News October 14, 2025

కర్నూలుకు మోదీ.. పాఠశాలలకు సెలవు

image

ప్రధాని నరేంద్ర <<18001308>>మోదీ<<>> ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనుండటంతో 15, 16 తేదీల్లో నాలుగు మండలాల పరిధిలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూల్ అర్బన్, రూరల్, కల్లూరు, ఓర్వకల్ మండలాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. FA-2 పరీక్షలు 21, 22వ తేదీలలో నిర్వహించాలని ఆదేశించారు.

News October 14, 2025

కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌గా సురేష్

image

కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా దేవల్ల సురేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గిరిజన సంక్షేమ హాస్టల్లో వసతులు మెరుగుపడేలా, ఎలాంటి అసౌకర్యం రాకుండా గిరిజన సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. సురేష్ గతంలో అనంతపూర్ గిరిజన సంక్షేమ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ డీటీడబ్ల్యూఓగా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీ అయ్యారు.